నారాయణ స్వామిపై ధ్వజమెత్తిన డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు జిల్లా, ప్రారంభంలో నామినేషన్ వేసేటప్పుడు పాన్ కూడా లేని స్వామీ ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు అని జనం కోడై కూస్తుంటే నేనేమైన అడిగానా? ఒక మహిళకు పుత్తూరులో హోటల్ పెట్టించారాని పుత్తూరులో ఉన్న జనాంగమే నోటి మీద వేలేసుకొని దీని భావమేమి తిరుమలేశా? అని అంటుంటే…నేనేమైనా అడిగానా?? ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ పదవులకు అమ్యామ్యాలు సమర్పించుకొని తలమీద గుడ్డవేసుకొని ఎవరికీ చెప్పు కోవాలి రామచంద్రా మా బాధలు అని మీవాళ్ళే గుసగుస లాడారు… నేనేమైనా అడిగానా? నీ మేనల్లుడికి అర్హత లేకపోయినప్పటికి టెండర్లు ఎలా పాడుతున్నాడు, నాసిరకం రోడ్లు వేసి ఎలా కోట్లు గడిస్తున్నాడనీ పలువురు టీ అంగళ్ళ దగ్గర డిబేట్లు పెడుతుంటే నానా రకాలుగా మాట్లాడుతుంటే… నేనేమైనా అడిగానా?? సబ్స్టేషన్లో ఉద్యోగాల కోసం మీ కుమార్తె ఒక్కొక్క పోస్టుకి 10 లక్షలు వసూలు చేసిందని ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తుంటే…నేనేమైనా అడిగానా? మినిస్టర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు తిరుమలలో వి.ఐ.పి దర్శనాలకు మీతో కూడా పలువురికి, మీరు లేకుండా దర్శనాలకు లక్షల్లో వసూలు చేసారని, ఇప్పుడు కూడా వసూలు చేస్తున్నారని నేనే మైనా అడిగానా? అయన నరనరాల్లో బందు ప్రీతి, స్వార్థంతో మునిగి పోయి ఉన్నాడని ముఖ్య నాయకులే అంటుంటే నేనేమైనా అడిగానా? పార్టీలో కొన్ని వందల మంది పనిచేస్తుంటే తన భార్యకే జడ్పీటీసీ, తన బావ మరిదికే సర్పంచి పదవి కట్ట బెట్టిన వాడు మనకి ఏమీ చేస్తాడు? ఇక ప్రజలకేమి చేస్తాడని మీ వాళ్లే అంటుంటే నేనేమైనా అడిగానా? పవన్ కళ్యాణ్ ని డబ్బు ఇచ్చి కొనగలిగే మగాడు, మొనగాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టొబోడు.. నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? నీకు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఏదంటే అది మాట్లాడుతున్నావని. ఈసారి ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేస్తారని. డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదని… ఓటమి పాలవ్వడం తద్యమని… జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి డా.యుగంధర్ పొన్న తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.