జగన్ మోసాన్ని ప్రజలకు తెలియజేయాలి

🔸 పత్రికా సమావేశాన్ని నిర్వహించిన జనసేన నాయకులు
🔸 జగనన్న మోసాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చిన నాయకులు ఆదాడ, రౌతు

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు జగనన్న ఇళ్లు వలన పేదలందరి కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేయాలని చెప్పే కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద అంబేత్కర్ సామాజిక భవనంలో పత్రికా, మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆదాడ మోహనరావు మాట్లాడుతూ జగన్ నవరత్నాలలో ఒక్కటైన జగనన్న ఇళ్లు మంజూరులో జరిగిన మోసాలను వెలికితీసి ప్రజలకు ప్రతీఓక్క జనసైనుకుడు,వీర మహిళలు తెలియజేయాలని కోరారు. కాగా రాష్ట్రంలో జగన్ రెడ్డి రాష్ట్రం మొత్తమ్మీద మొదటి విడతలో 18,63,552 గృహాలను 2022, జూన్ నాటికి మంజూరు చేస్తామని మాట ఇచ్చి, ఇప్పటికీ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, జగనన్న ఇళ్లు కోసం బీసి, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు కొనుగోలులో కూడా వేలకొట్లలో కుంభకోణాలు జరిగాయని, ఈ అక్రమాలను బయటకు తీసి ప్రజలకు తెలియ పరుస్తామని అన్నారు. మరో నాయకులు రౌతు సతీష్ మాట్లాడుతూ సుమారు పద్దెనిమిది లక్షలపైగా 2022, జూన్ నాటికి ఇస్తామని చెప్పి ఇంతవరకు సుమారు ఒక లక్షా ఏబైవేలు మాత్రమే ఇల్లులు నిర్మించారని, ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్లలో కుంభకోణం జరిగిందని అర్థమౌతుందని, వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలకు ఇదిగో అదిగో అని మబ్బి పెడుతున్నారని అన్నారు. కావునా నవంబర్ 12, 13, 14వ తేదీల్లో ఈ జగనన్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మొదటిరోజు, నవంబర్, 12వ తేదీ శనివారం గుంకలాంలో జగనన్న సగం సగం నిర్మితమైన కాలనీలో నిరసన చేపడతామని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో జనసేన ఝాన్సీ వీర మహిళ గంట్లాన పుష్ప కుమారి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు వంక నరసింగరావు, లాలిసెట్టి రవితేజ, పొట్నురు చందు,యువ నాయకులు కోయ్యాన లక్ష్మణ యాదవ్, లోపింటి కళ్యాణ్, పత్రి సాయికుమార్, చందు, కందివలస సురేష్, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.