జగనన్న కాలనీలా లేక మందు బాబుల ఆవాసాలా…?

అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాలమేరకు రెండవరోజు జగనన్న ఇల్లు అందరికి కన్నీళ్లు అనే కార్యక్రంలో భాగంగా రెండవ రోజు నార్పల మండలంలోని బి పప్పూరు గ్రామంలోని జగనన్న కానీలను సందర్శించడం జరిగింది. కాలనీలో ఎక్కడ చూసినా ముళ్ల పొదలు వాటి మధ్యలో మందు బాబులు తాగి పడేసిన గాజు పెంకులే దర్శనమిస్తున్నాయి. కాలనీలో తమ స్థలం ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి లబ్దిదారులది పిచ్చి మొక్కలతో హద్దు రాళ్ళూ కూడా కనిపించడం లేదు. జగనన్న కాలనీ అని పట్టాలు పంపిణి చేయడం పెద్ద మోసం, నివాసానికి ఏమాత్రం పనికిరాని కొండా ప్రాంతంలో పట్టాలు పంపిణి చేయడం జరిగింది . గతంలో జగన్ మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కట్టించి అక్క చెల్లెమ్మలకు తాళాలు చేతికిస్తాము అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అధికారం రాగానే మాట మార్చారన్నారు. కొండలలో గుట్టలలో స్థలాలను పంపిణి చేస్తే ఇలాంటి ప్రాంతాల్లో పట్టాలు ఎలా కేటాయిన్చారని ప్రతిపక్షాలు ప్రశ్నించి అడ్డుకునే ప్రయంత్నం చేస్తారని అప్పుడు మనం నిర్మాణాలు చేయనవసరం ఉండదనే దురుద్దేశంతో ముందుగానే ఊహించి ఉద్దేశపూర్వకంగానే కొండలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో భూసేకరణ చేసారని ఆరోపించారు. జగనన్న కాలనీ పేరుతో ప్రజలకు పట్టాలిస్తే మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అని ప్రచారం చేసి పబ్బం గడుపుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యే గొన్నలగడ్డ పద్మావతి ఇంటి పట్టాలు పంపిణీ చేసి దాదాపు 8 నెలలు గడుస్తూన్న కనీస మౌళిక వసతులు అక్కడ కల్పించలేదని, మందుబాబులకు ఆవాసాలుగా మారిపోయాయని లబ్ది దారులు వాపోతున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మౌలిక వసతులు కల్పించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి జయమ్మ, నార్పల మండల అధక్షుడు గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, వినోదం నారాయణస్వామి, పొన్నతోట రామయ్య, వినోదం కుళ్లాయప్ప, ప్రదీప్, గిరీష్, రాజు, చరణ్ కుమార్, వలిగిరి గణేష్, పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొనడం జరిగింది.