నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాం: యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట, నాదెండ్ల మనోహర్ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలుపుటకు నోవాటెల్ హోటల్ నుండి బయలుదేరగా పోలీసు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంగా నాయకులకు అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేటు. జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ట్రాఫిక్ అంతరాయం కాకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టుతామని ఎంత చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు వినక అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు కూడా మాకు లేదా. ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసనల ద్వారా తమ హక్కులను వినిపిస్తాయి. చాలా దారుణం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా ఆమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు సొంత నాయకులు జేబులు నింపుకునే దానికి రియాల్టర్లుగా మారి మరి రాష్ట్ర సంపాదన దోచుకున్న పరిస్థితులు వీటిని నిరసనల ద్వారా ప్రతిపక్షాలు తెలియజేసే కార్యక్రమం తలపెట్టితే పోలీసు వ్యవస్థ ద్వారా గొంతు నొక్కే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. మొత్తానికి నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్ట్ జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.