న్యూజిలాండ్ జనసేన ఆత్మీయ సమావేశం

న్యూజిలాండ్, డిసెంబర్ 4వ తేదీన న్యూజిలాండ్ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జనసైనికులు సత్య రెస్టారెంట్లో నిర్వహించడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యులనుద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేనానికి న్యూజిలాండ్ జనసేన తరపున ఏ విధమైన సహకారం అందించాలి మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి ఏవిధంగా తీసుకెళ్ళాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఇప్పటం గ్రామంలో ఇళ్ళ కూల్చివేతకు గురైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూపాయలు 1లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చేయూతగా న్యూజిలాండ్ జనసేన తరపున రూపాయలు 2.83 లక్షలు సమకూర్చడం జరిగిందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలను గౌరవించి వాటిని ప్రజలలోనికి తీసుకెళ్ళాలని చర్చించడం జరిగింది. ప్రతి నెలా న్యూజిలాండ్ జనసేన తరపున పార్టీకి విరాళాలను అందించి పార్టీకి సహకరించాలని, వచ్చే ఎన్నికలలో నాయకులకు అండగా నిలబడుతూ న్యూజిలాండ్ జనసేన తరపున తమవంతు సహకారం అందించాలని చర్చించడం జరిగింది. “అందరూ పాల్గొనాలి – అందరూ పంచుకోవాలి”, “మన మైండ్ నే ఒక ఆయుధంగా వాడాలి” మరియు “ఒక్క చాన్స్” అనే నినాదాలతో సమావేశాన్ని ముగించడం జరిగింది. ఈ సమావేశంలో కుల్దీప్ గంగిశెట్టి, సాయిరాం తోట, సాయి తోట, సత్య తట్టల, నితిన్, శంతన్ కె, కె వాసు, దాడి రమేష్, అప్పల నాయుడు, నాగేష్ కె, అప్పారావు కరణం, గోపాల్ శింగవరపు, మణి దూలం, రవి రాజ్ తోట, నాగభూషణం గోరంట్ల తదితరులు పాల్గొనడం జరిగింది.