కార్తికేయా కో-ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంపై జనసేన నిరసన

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు & సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు కాకినాడ సిటిలో మంగళవారం జనసేన పార్టీ శ్రేణులు కాకినాడ సిటిలోని కార్తికేయా కో-ఆపరేటివ్ బ్యాంకులో కుంభకోణంపై నిరసనగా బ్యాంక్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కాకినాడ సిటిలో పరిస్థితులు చూస్తుంటే భయాందోళనలు కలుగుతున్నాయనీ, వ్యవస్థీకృత నేరాలు, వైట్ కాలర్ నేరాల సంఖ్య పెరిగిపొతోందని ప్రజలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని జనసేన వర్గాలు నిరసన వ్యక్తం చేసాయి. కాకినాడ గతంలో పెన్షనర్స్ ప్యారడైజ్ అని రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినదని ఇక్కడ కో-ఆపరేటివ్ బ్యాంకులు, సొసైటీలు అనేకం ఉండేవన్నారు. ఈ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగ విరమణ చేసిన వృద్ధులు తమకు పదవీ విరమణ సమయంలో వచ్చిన మొత్తాలను డిపాజిట్ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో తమ శేషజీవితాన్ని గడిపేలా ఏర్పాట్లు చేసుకుంటారన్నారు. కానీ గతకొద్ది సంవత్సరాలుగా ఈ ఆర్ధిక నేరాలు పెరిగి కొన్ని సంవత్సరాల క్రితం జయలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకులోను ఇలాగే అవకతవకలు జరిగి డిపాజిటర్లు దగాచెంది ఇప్పటికీ న్యాయం జరగక ఆక్రోశిస్తున్నారని, ఇప్పుడు కార్తికేయా కో-ఆపరేటివ్ బ్యాంకు వంతు అయ్యిందని దీనిపై జనసేన పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. డిపాజిటర్ల తరపున జనసేన పార్టీ పోరాటం చేస్తుందనీ వారికి న్యాయం జరిగేంతవరకు విశ్రమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ్ సిటి అధ్యక్ష్యుడు సంగిసెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, సిటి పార్టీ నాయకులు అడబాల సత్యన్నారాయణ, భాస్కర్, రమణారెడ్డి, లోవరాజు, ర్యాలి రాంబాబు, వీరబాబు, షమీర్, ముత్యాల దుర్గాప్రసాద్, వార్డ్ నాయకులు మనోహర్ లాల్ గుప్తా, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, మౌనిక్, మొయీన్, మవులూరి సురేష్, వాసంసెట్టి శ్రీను, చిరంజీవి, చిడిసెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.