స్పీడ్ పెంచిన బత్తుల..

  • ఉదృతంగా కొనసాగుతున్న జనం కోసం జనసేన, మహా పాదయాత్ర

రాజానగరం నియోజకవర్గంలో ఓపక్క కోరుకొండ మండలంలో నిడిగట్ల గ్రామంలో బత్తుల వెంకటలక్ష్మి పాదయాత్రలో విస్తృతంగా పర్యటిస్తుండగా… మరోవైపు నియోజకవర్గంలో పూర్తిగా వెనుకబడిన గ్రామమైన నల్గొండ(సీతానగరం మండలం) గ్రామంలో నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన మహా పాదయాత్ర లో.. దుర్భర పరిస్థితుల్లో జీవితాలు అనుభవిస్తున్న నల్గొండ గ్రామంలో పరిస్థితులు చూసి పూర్తిగా చలించి పోయిన బత్తుల బలరామకృష్ణ జనసేన ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి లభించి, మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని.. ప్రజలందరూ అభివృద్ధి చెందుతారని.. ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. రాత్రి 10 గంటల సమయం వరకూ ఉదృతంగా, ఉత్సాహంగా నల్గొండ గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో మహాపాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగింది.. నల్గొండ గ్రామ ప్రజలు జనసేన పార్టీ పట్ల పూర్తి సానుకూల వైఖరి చూపిస్తూ.. అధినేత పవన్ కళ్యాణ్ మరియు బలరామకృష్ణ నాయకత్వం పై నమ్మకంతో ప్రజలు పెద్దఎత్తున ముందుకు రావడం శుభదాయకం. ఈ కార్యక్రమంలో మట్ట వెంకన్న, దాసరి రమేష్, ముత్యాల హరీష్, మహేష్, నాగవరపు సత్తిబాబు, అంబేద్కర్, సూరిబాబు, మోహన్, కరాటం బంగారం, ప్రగడ శ్రీహరి, రొంగలి అభిరామ్ నాయుడు, ముత్యాల హరీష్, చిక్కిం నాగేంద్ర, నంది శ్రీను, మూర్తీ, దాస రమేష్ సూరెడ్డి మణికంఠ, సందీప్, ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.