రోశయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన జనసేన లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ కళావతి కరణం

కోణిజేటి రోశయ్య ఒకప్పుడు ఈయన అసెంబ్లీలో ఉన్నారన్టే, చర్చలు అర్థవంతంగా, లెక్కలు సహితంగా, వ్యంగ్యోక్తులు, చతురోక్తులతో పూర్తిగా విశ్లేషణాత్మకంగా ఉండేవి. మాట మెల్లగా ఉన్నా, పదాల్లో వాడి, వేడి ఉండేది. అటువంటి వేడి తట్టుకోలేక, శ్రీ రోశయ్య ఎమ్మెల్సీగా మండలిలో ప్రతిపక్ష నేతగా నాటి నందమూరి తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వం విథానాల పట్ల చాలా పదునైన విమర్శలు చేయటంతో, అయన విమర్శల తుఫాను తాకిడికి మండలినే పూర్తిగా రద్దు చేయటం జరిగింది 80వ దశకం మద్యలో. అయన ఏంతో మంది ముఖ్యమంత్రులతో సఖ్యతగా ఉండటం వలన, కాంగ్రెసు ప్రభుత్వం ఉంటే, మంత్రిగా ఉంటూ ఎప్పుడూ నెంబరు.2 స్థాయిలో ఉండేవాడు. వరుసగా ఏడు సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత అయనది. అయన జీవితంలో ఉన్న ఏకైక మరక, రాష్ట్ర విభజన ఉద్యమం తీవ్రమైన స్థాయిలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో దానిని నియంత్రణ చేయలేకపోవటం. ఇదొక్కటే అయన జీవితంలో వెలితిగా ఉన్న అంశం. పలు మంత్రిత్వ శాఖలు చేసినా, అత్యథిక కీర్తిని అర్థిక మంత్రిగా గడించారు. ముఖ్యంగా శ్రీ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసాంతం శ్రీ రోశయ్య సలహలు, సూచనల పైన జరిగేది. రోశయ్య అర్థిక విషయంలో కోర్రీ పెడితే, రాజశేఖరరెడ్డి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇది రోశయ్య నిజాయితీ, నిబద్ధతకు ప్రత్యక్ష సాక్ష్యం. అయన చివరిగా అదిరోహించిన పదవి తమిళనాడు రాష్ట్ర గవర్నరు. ముఖ్యమంత్రి హోదాలో నాడు శ్రీ చిరంజీవికి అత్యంత విలువను, గౌరవాన్ని ఇచ్చారు. అదోక కారణం నాడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనం కావటానికి. రోశయ్య అత్యంత మర్యాదస్తుడు. ఏదేమైనా నాటి తరం ఆణిముత్యం కనుమరుగైనది. బహుశా నాటి తరానికి చెందిన అఖరి నాయకుడు శ్రీ రోశయ్య అనటం అతిశయోక్తి కాదు. శ్రీ రోశయ్య హఠాన్మరణంకి వ్యక్తిగతంగానే కాదు, జనసేన పార్టీ తరపున కూడా ఘనమైన శ్రథ్థాంజలి ఘటించిన జనసేన విశాఖపట్నం జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ లాయర్ కళావతి కరణం.