కంచిలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన దాసరి రాజు

ఇచ్చాపురం: కంచిలి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ 24 గంటలు సర్వీసులు అన్న ప్రభుత్వ ఆసుపత్రులు, సిబ్బంది కొరత కారణంగా 8 గంటల సర్వీసులకే పరిమితమయిందని, డాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా స్టాఫ్ నర్సులు, స్టాఫ్ లేకపోవడంతో 24 గంటలు సర్వీసులు ఇవ్వలేకపోతున్నామని, ఈ ఆసుపత్రిలో డాక్టర్లు ఇద్దరు, స్టాఫ్ నర్సులు ముగ్గురు అయితే ఇద్దరు, ఎమ్.ఎన్.ఓ లు ముగ్గురికి ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, అందువల్లనే మేము 24 గంటల సర్వీసులు అందించలేక రాత్రి ఆసుపత్రిని బంద్ చేస్తున్నాం అని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ విషయమై దాసరి రాజు మాట్లాడుతూ.. కంచిలి మండలం హెడ్ క్వార్టర్ అయినప్పటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల సర్వీసులు ఇవ్వకపోవడం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అవసరమైన స్టాఫ్ ను వీలైనంత త్వరితగతిన నియమించి 24 గంటలూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి సర్వీసులు అందించని యెడల జనసేన పార్టీ తరపున భారీ ఎత్తున నిరసన చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంచిలి మండలం జడ్పిటిసి అభ్యర్థి డొక్కారి ఈశ్వర్ రావు, వేణు, సుశీల, రొక్కల భాస్కర్ రావు, మన్మధ, మురళి, భాస్కర్, రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.