జనసేన ఐటీ విభాగం, సోషల్ మీడియా & యూత్ మీటింగ్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం ఆదిత్య ఫంక్షన్ హల్ వేదికగా రాజానగరం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన టీ విభాగం సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి ఐటీ కోఆర్డినేటర్ గాలిదేవర తామేష్ అధ్యక్షతన నిస్వార్ధ జనసైనికుల సహకారంతో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ జమాల్ హాలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సంబంధించిన “అస్త్ర యాప్ ” ప్రతి జన సైనికుడు ఉపయోగించాలని అలానే ఓటర్ రిజిస్ట్రేషన్ మొబైల్ ఫోన్లో ఎలా చేయాలి అనే గొప్ప విషయాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జ్ గురుదత్ మాట్లాడుతు అధిష్టానం ఆదేశాల మేరకు మన నియోజకవర్గం ఐటీ మీటింగ్ నిర్వహించిన వెంటపాటి రామకృష్ణ, గాలిదేవర తామేష్ గార్ల సేవను గుర్తించి సాలువతో సత్కరించారు. వారిని సభాముఖంగా అభినందించి జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ఐటీ రంగం కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు, అలానే మిగతా రాజకీయ పార్టీలకు ఐటీ వారి సేవలకు ఎంతగానో ఖర్చు పెడతారు, కానీ మన జనసేన పార్టీ కోసం వారి విలువైన సమయాన్ని పార్టీ కోసం కేటాయించి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కష్టపడుతున్నారని అన్నారు. జనసేన పార్టీ ఆడపడుచు & జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి మాట్లాడుతూ ఐటీ టేంని అభినందించి జనసేన పార్టీ అని చెప్పుకుని సోషల్ మీడియా వేదికగా కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం జనసేన పార్టీలో వున్న వ్యక్తులను దూషించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. వారి అధిష్టానం తోరలోనే మంచి గుణపాఠం చెప్పుతుంది మీరు పార్టీ కోసం ఆలోచిస్తే మంచిదని అన్నారు. ఈ కార్యక్రమం కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్,సీతానగరం మండల వీరమహిళ కందికట్ల అరుణ, రాజానగరం మండలం వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, మూడు మండలలా కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, నియోజకవర్గంలో నలుమూల వున్నా నిస్వార్ధ జనసైనికులు ఐటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.