కొత్త కందరడా గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

పిఠాపురం: ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త కందరడా గ్రామంలో ఎంపీపీ స్కూల్, పాత కందరడా ఎంపీపీ స్కూల్ నందు జడ్పీ హై స్కూల్ నందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
జనసేన నాయకులు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్లు, కందరడా జనసేన ఎంపీటీసీ పిల్లా సునీత సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ భారతి ప్రసాద్, గ్రామ వార్డ్ మెంబెర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.