జనసేన నేత ఆర్కేకు గౌరవ డాక్టరేట్

  • విశేష సేవా కార్యక్రమాలకు గాను హైదరాబాద్ లో అర్కేకు డాక్టరేట్ ప్రధానం చేసిన హెచ్.ఎస్.సి యూనివర్సిటీ ప్రతినిధులు
  • చిన్న వయసులోనే గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆర్కే అరుదైన ఘనత సాధించారు

గుడివాడ, విశేష సేవా కార్యక్రమాలకు గాను హైదరాబాద్ లో అర్కేకు హెచ్.ఎస్.సి యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ(ఆర్కె) మాట్లాడుతూ కృష్ణాజిల్లా గుడివాడ పట్నంలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సహించి సికింద్రాబాద్ లోని హెచ్ ఎస్ సి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ అవార్డు నాకెంతో ఉత్సాహం ఇచ్చిందని, ఈ ప్రోత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమలు చేసుకుంటూ గుడివాడ పట్నంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవా కార్యక్రమలు చేసుకుంటూ ఉంటానని తెలియజేసారు. ఈ గౌరవ డాక్టర్ అవార్డు రావడానికి కారణం అయిన నా స్ఫూర్తి ప్రదాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని తెలియజేసారు. ఈ ఘనత సాధించేందుకు సహకరించిన మా టీం సభ్యులు, గుడివాడ ప్రజలు, పోలీస్ అధికారులు, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నను అని తెలియజేసినారు.