జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అదే జోరు

గాజువాక, జనసేన పార్టీ జీవీఎంసీ 85వ వార్డ్ ఇన్ఛార్జ్ గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం వార్డులో చేరిన కొత్తూరు, డొంకాడ, పూడివాణి పాలెం, పినమడక కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం వద్ద సభ్యత్వ నమోదు మరియు రెన్యూవల్ కార్యక్రమం కోలాహాలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ఎక్కువగా క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ అనుకోని దుర్ఘటన జరిగితే జనసైనికుల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఐదు లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారని, దీనిమూలంగా గత సంవత్సరంలో ఈ వార్డులో యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జనసైనికుల కుటుంబాలను ఆదుకోగలిగామని తెలియచేశారు. ఈ సభ్యత్వ నమోదుకు ఈనెల 28వ తేదీ ఆఖరి రోజు కావున మిగిలిన రెండు రోజులలో మిగతావారు కూడా సభ్యత్వ నమోదు మరియు రెన్యువల్ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి రామచంద్ర రావు, దామురోతు అప్పలరాజు, నీలం రమేష్ బాబు, శీతిన నాగరాజు, దాసరి శివ కుమార్, ఎ అప్పలరాజు, దాసరి శ్రీను, మంత్రి శ్రీను, సీతన జానకిరామ్, కర్రి తరుణ్ కుమార్, దామురోతి కార్తీక్, బలిరెడ్డి అరవింద్, పి వసంత కుమార్, సీరంశెట్టి వెంకట్రావు, కళ్ళుబంటి సుధాకర్, లక్కరాజు సన్యాసిరావు, పొడుగు శ్రీనివాసరావు, గొంతున నాయుడు, లక్కరాజు రమణ, జాజుల శ్రీనివాసరావు, ఎదురి మాధవ్, సర్వసిద్ధి రవి, దలై జనార్దన్, ఇల్లపు శ్రావణ్, కర్రి శ్రీను, కరణం శివాజీ, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.