తెలుగు జాతి, యావత్ భారతీయుల హృదయాలు గర్వంతో నిండిపోయిన క్షణాలివి..

  • ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు

నెల్లూరు: ఆర్.ఆర్.ఆర్ నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినీ చరిత్రలో మరో మైలు రాయి అంటూ రామ్ చరణ్ అభిమాని ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ అంటూ వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన త్రిబుల్ ఆర్ టీం కి ప్రత్యేక అభినందనలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇందులో భాగస్వామి కావడం ప్రముఖ పాత్ర వహించడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా వజ్రోత్సవంలో చిరంజీవి గారు యుఎస్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు వెళ్తే అక్కడ భారతీయ సినిమా గుర్తించుకో తగ్గ విధంగా ఏ స్మారక చిహ్నం లేదని తెలిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు విన్నర్ అవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ విజయానికి గర్వ కారణమైనచంద్రబోస్ గారికి, కీరవాణి గారికి, రాజమౌళి గారికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి రామారావు గారికి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్ తో పాటు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, మధు, షాజహాన్, హేమచంద్ర యాదవ్, అలేఖ్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు.