అబుదాబిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అబుదాబి: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అబుదాబిలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గల్ఫ్ సేన జనసేన కార్యకర్తలు, పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేయగా, ఈ కార్యక్రమం కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అబుదాబి కోఆర్డినేటర్ కేడి విఎస్ నారాయణ, కృష్ణ కిషోర్ వీరమల్లు, దుబాయ్ కోఆర్డినేటర్ రమేష్ బాబు గంధం, పార్టీ కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.