బొలిశెట్టి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే గా గెలిపించండి: సుమన్

తాడేపల్లిగూడెం: మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తాను దూరంగా ఉన్నానని, మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ప్రజలు పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. తనకు బొలిశెట్టి శ్రీనివాస్ పదేళ్ల నుండి మిత్రుడని అధికారంలో లేకపోయినా తన సొంత డబ్బుతో ప్రజాసేవ చేస్తున్న విషయాన్ని గమనించాను అన్నారు. కొన్ని అమానవీయ సంఘటనలు తన మన తన మనసును కదిలించి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా ఏ పార్టీకి ప్రచారం చేయనని మంచి మనసున్న బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వ్యక్తులను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలన్నారు. సుమన్ రాక తెలుసుకున్న అభిమానులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.