అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తున్న కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం గ్రామంలో జీవీఎంసీ నిధులతో సీసీ రోడ్లును దగ్గర ఉండి నాణ్యతను పరీక్షించి వేయించడం జరిగింది. ఈ సందర్భంగా 64వ వార్డుకార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి నాది బాధ్యత, మీకు ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కార్పొరేటర్ గోవిందరెడ్డిగారికి అభినందనలు తెలుపుతూ ఆనందంతో హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సత్యనారాయణపురం గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.