జనసైనికులారా.. వైస్సార్సీపీ, టీడీపీ ట్రాప్ లో పడకండి: సయ్యద్ నాగుర్ వలి

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండల జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన ప్రెస్ మీట్ లో నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి జనసైనికులకు పలు సూచనలు చేసారు. ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ, టీడీపీ ట్రాప్ లో పడకండి. జనసైనికులలో కొంత మంది పవన్ కళ్యాణ్ చెప్పినదాని కంటే వైస్సార్సీపీ, టీడీపీ మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేసిన వాటికే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. ఆ రెండు పార్టీలకు, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లొసుగులు బయటకి రాకుండా ఉండాలి అంటే వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి. మూడవ పార్టీ రాకూడదు. దీనికి తగ్గ వాళ్ళ వ్యూహం వాళ్ళకి ఉంటుంది. ముల్లుని ముల్లుతోనే తియ్యాలి. దాని కోసం మన వ్యూహం మనకి ఉంటుంది. అధికారం చేపట్టడం కోసం మన ప్రణాళిక మనకి ఉంటుంది, సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది. మనకి వైస్సార్సీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడ ప్రత్యర్థ పార్టీలే. ఏ ఒక్క పార్టీతో మనకి లొసుగులు లేవు. మీరు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం అని జనంలోకి వెళ్ళండి. మన లక్ష్యం 175 స్థానాలలో బలంగా పోరాటం చెయ్యడం, కనీసం 100 స్థానాలు గెలవడం. ఈ లక్ష్యంలో ఎటువంటి మార్పు లేదని సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.