జనసేన భీమ్ యాత్ర 11వ రోజు

కాకినాడ సిటి: జనసేన భీమ్ యాత్ర 11వ రోజు కార్యక్రమం 17వ డివిజన్లోని అంబేడ్కర్ విగ్రహం సమీప ప్రాంతంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ స్థానిక దళితులని చైతన్యపరుస్తూ, మాట్లాడుతూ దళితులపై ఈ నాలుగున్నర ఏండ్లు దండయాత్రలు జరుపుతూ ఇప్పుడు ఎన్నికలముందర సామాజిక యాత్ర అంటూ మొసలి కన్నీరు మొదలెట్టారు ఇప్పటికి గుర్తొచ్చామా అని ప్రశ్నించారు. పోనీ ఇప్పుడన్నా యాత్రలు జరుపుతున్నారు. అని దళితులపై దాడులు ఆపుతున్నారా అన్నది ఈ వై.సి.పి పార్టీ వాళ్ళు అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎద్దేవా చేసారు. పరదాలు కట్టించుకుని పర్యటనలు జరిపే ఈ ముఖ్యమంత్రికి దళితుల ఆక్రందనలు ఎలా కనపడుతున్నాయో, వినిపిస్తున్నాయో యాత్రలు జరిపే రాష్ట్ర మంత్రులు, వై.సి.పి పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేసారు. జనసేన పార్టీ ముందునుడీ ఒకటే విధానంతో దళితుల తరపున వారికి న్యాయంకోసం పోరాటం చేస్తోందనీ, అందులో ఎలాంటి రాజీ పడదని తెలిపారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, శివాజీ యాదవ్, మండపాక దుర్గాప్రసాద్, చీకట్ల వాసు, బండి సుజాత, బట్టు లీల, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి, మిరియాల హైమావతి తదితరులు పాల్గొన్నారు.