హిందూపురం జనసేనలో చేరికలు

హిందూపురం, చిలమత్తూరు మండలంలో అనంతపురం జిల్లా కార్యదర్శి ళిచ్ రమణ, చిలమత్తూరు మండల అధ్యక్షుడు చిన్నా ప్రవీణ్, అనంతపురం ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యలు అగ్గి శీన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలకై మేము సైతం అంటూ వివిధ వర్గాలకు చెందిన 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. వీరందరికి హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆకుల ఉమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసేవిధంగా, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసే విధంగా ప్రతి ఒక్క జనసైనికుడు పోరాడాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు. పార్టీలో చేరినవారిలో చిలమత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జయచంద్ర, రాయల్ చందు, మొలబాగులపల్లి గ్రామానికి చెందిన యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మండల, పట్టణ అధ్యక్షులు చక్రవర్తి, కొల్లకుంట శేఖర్, లేపాక్షి మండల నాయకులు లోకేష్, నరేష్, మల్లికార్జున, చిలమత్తూరు మండల ఉపాధ్యక్షులు అంజి తదితరులు పాల్గొన్నారు.