దళితులకు అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వస్తా

  • కనపర్తి మనోజ్ కుమార్ కు భరోసానిచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్

నెల్లూరు: వలేటివారిపాలెం మండలం, బడేవారిపాలెం గ్రామానికి చెందిన పెంట్యాల కృష్ణబాబు(బుజ్జి) అనే వ్యక్తి పైన దళితుడు కనపర్తి మనోజ్ కుమార్ జులై 19న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది.
జులై 15వ తేదీన కందుకూరులో ఉదయం సుమారు 9 నుండి 10 గంటల సమయంలో ఎల్.ఐ.సి ఆఫీస్ దగ్గర పెంట్యాల కృష్ణబాబు యొక్క అనుచరుడు (మనోజ్ కి తెలియని వ్యక్తి ) మనోజ్ కుమార్ వద్దకు వచ్చి, కృష్ణబాబుకి 10 కోట్ల అప్పు ఉంది, ఎయిడ్స్ కూడా ఉంది, నువ్వు అట్రాసిటీ కేసు పెట్టావు ఈ మూడు సమస్యలతో కృష్ణబాబు ఎవరికి చెప్పుకోలేని బాధని అనుభవిస్తూ, సతమతమైపోతున్నాడు, నీకు 10 లక్షలు డబ్బులు ఇస్తాను కేసు వెనక్కి తీసుకో అని రిక్వెస్ట్ గా మనోజ్ కుమార్ ని అడిగారు. దానికి మనోజ్ కుమార్ ఒప్పుకోలేదు, మరలా మనోజ్ కుమార్ ని బెదిరించారు. ఒక పక్కన అట్రాసిటీ కేసుకు సంబంధించి డి.ఎస్.పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, మరోపక్కన కృష్ణబాబు అనుచరులు మనోజ్ కుమార్ ని బెదిరిస్తున్నారు. శుక్రవారం మనోజ్ కుమార్ విజయవాడకి వెళ్లి జరిగిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను కలసి ఆధారాలను చూపించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ కేసుపై సానుకూలంగా స్పందించిన ఎస్సీ కమిషన్ ఈ కేసుని పై స్థాయికి తీసుకెళ్లి, కృష్ణబాబుకి కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తాను అని తెలియజేశారు. దళితులకు అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వస్తాను, పోరాడుతాను న్యాయం చేస్తాను అని ఎస్సీ కమిషన్ మనోజ్ కుమార్ కి ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసాని ఇచ్చారు.