అసమర్థ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం: శోభన్ బాబు

గంగాధర నెల్లూరు, కార్వేటినగరం మండలం, అయిదో తేది కావస్తున్నా ఇంకా పెన్షన్ ఇవ్వలేని పనికిమాలిన ప్రభుత్వం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమని ప్రజల జీవితాలు బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, అవ్వా, తాతలకు సకాలంలో పింక్షన్ ఇవ్వాలన్నా, అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అవ్వాలన్నా, మొత్తానికి ఆంధ్రరాష్ట్రం బాగుపడాలంటే అది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే సాధ్యమని, అయిదో తేది కావస్తున్న కూడా ఇంతవరకు ప్రభుత్వం పింక్షన్ లు ఇవ్వలేదు. దాని మీదే ఆధారపడి బతుకుతున్న అవ్వ, తాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పుల అప్పారావుకి అప్పులు ముట్టనట్టుంది, ఇలాంటి అసమర్థ సీఎం ఆంధ్రప్రదేశ్ కు అవసరమా? ప్రజలు ఆలోచించాలి. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కార్వేటినగరం మండల జనసేన పార్టీ అద్యక్షులు శోభన్ బాబు తెలిపారు.