వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాలు పేరుతో దోపిడీ

  • తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులుతో కలిసి కనపర్తి మనోజ్ కుమార్ ఆందోళన
  • చేస్తున్న జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్
  • పేదల ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నాయకులు అవినీతి చేశారు, ఆధారాలు మీడియాకి రేపు చూపిస్తాను

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వంలో టంగుటూరులో పేదలు పట్టాలను నాయకులు దోచుకున్నారని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఇళ్ల పట్టాలు పేరుతో నష్టపోయిన బాధితులుతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొండేపి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు నాయకులు కలిసి పట్టాలు పేరుతో పేదలను మోసం చేశారని ఆరోపించారు. లంచాలు తీసుకుని షాడో విఆర్ఓ ఫోర్జరీ సంతకాలతో సోమేపల్లి కల్పనకు నకిలీ పట్టా ఇవ్వటం దుర్మార్గం, షేక్ హుస్సేన్ బీ పేరుతో పట్టా మంజూరు చేసి రికార్డులో పులిచర్ల ధనలక్ష్మి పేరు నమోదు చేయడం అధికారులు నాయకులు దోపిడీ కాదా? అని ప్రశ్నించారు, టంగుటూరు జగనన్న లే అవుట్ లో నష్టపోయిన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ జనసేన పోరాటం చేస్తుంది. పట్టా లబ్ధిదారులకు మద్దతుగా శనివారం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆదేశాలు మేరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఫోర్జరీ సంతకాలతో పట్టాలు మంజూరు చేసి అధికారులు ప్రజలను మోసం చేసిన నాయకులను అరెస్టు చేసే వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తేల్చి చెప్పారు. టంగుటూరులో జగనన్న లేఔట్ లో నష్టపోయిన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం జనసేన పోరాటం చేస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలకు కొండేపి నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామన్నారు. పేదల పేరుతో నాయకులు దోచుకున్న పట్టాలు ఫోర్జరీ సంతకాలతో పట్టాలో బాగోతం వెలుగులోకి తీసుకొచ్చేవరకు లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జగనన్న లేఔట్ లో నష్టపోయిన లబ్ధిదారులు సోమేపల్లి కల్పన హుస్సేన్ బి పాల్గొన్నారు.