అనంతరాయుడు పేటలో మన సీతానగరం – మన జనసేన

పార్వతీపురం, రెండవ విడత “మన సీతానగరం – మన జనసేన” కార్యక్రమం అనంతరాయుడు పేటలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సిద్ధాంతాల్ని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాల్ని కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంచుతూ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వివరించటం జరిగిందని జనసేన శ్రేణులు వివరించటం జరిగింది. పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి అల్లు రమేష్ మాట్లాడుతూ ఆదివారం అధికార వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, అభివృద్ధికి దూరంగా మార్చి విచ్చల విడి నియంత పోకడలతో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి మీ పిల్లల భవిష్యత్తు కు మంచి బాట, రైతుకు మేలు జరిగేలా రైతే రాజు అని నిరూపించే విధంగా ఉండాలి అన్నా, బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలి అన్న, విద్య వైద్యం సక్రమంగా అందాలి అన్నా కష్టం విలువ తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని చెప్పటం జరిగింది.. చివరిగా గ్రామ ప్రజలకి ధన్యవాదాలు చెబుతూ ” పవన్ రావాలి – పాలన మారాలి” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జనసేన శ్రేణులు ఆ గ్రామంలో ముగింపు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్యాడ మురళీ, భాస్కర్, శ్రావణ్, గౌరు నాయుడు, గణేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.