ఏలూరు జనసేన ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఏలూరు, అనేక సంస్కరణలకు ఆద్యుడైన పూలే మనకు ఆదర్శమని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని స్థానిక ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారన్నారు. భార్య సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో స్థాపించారన్నారు. వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా నిర్మించి సేవలందించిన ఘనత మొట్టమొదటి వ్వక్తి జ్యోతిరావు పూలేనే అన్నారు. బాల్య వివాహాలు అడ్డుకొని, బాలికలకు విద్యను అందించి వారు ఉన్నత స్థానాలకు ఎదిగేలా ఈ దంపతులు చేసిన కృషి మరువలేనిదన్నారు. అనేక సంస్కరణలకు ఆద్యుడైన పూలే మనకు ఆదర్శమన్నారు. అక్షరం ద్వారానే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని నమ్మి, వారి అభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఇటువంటి మహనీయుని అన్ని తరాలవారు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, సోషల్ సర్వీస్ మురళి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు బోండా రాము నాయుడు, గొడవర్తి నవీన్, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, భూపతి ప్రసాద్, మడుగుల మాణిక్యాలరావు, రాపర్తి సూర్యనారాయణ, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.