వేలేరుపాడులో జనంకోసం జనసేన 67వ రోజు

పోలవరం, జనంకోసం జనసేన కార్యక్రమం 67వ రోజు వేలేరుపాడు మండలం తూర్పుమెట్ట, కొత్తూరు, వేలేరుపాడు పంచాయతీలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యమైన సమస్య నిర్వాసితులు ఏ గ్రామంలో వెళ్లిన ఇదే సమస్యతో బాధపడుతున్నారు. 2019లో ఎన్నికల్లో ఇప్పుడు గెలిచినా అధికార పార్టీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వాసిత భాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఆ హామీ గాలికి వదిలేసాడని, నిర్వాసితులకు ఇచ్చే ఇళ్ల విలువల్లో నష్టపరిహారం పూర్తిగా తగ్గించడం, లిస్టులో పేర్లు తీసేటయడం, లంచం ఇచ్చిన వారికి ఇంటికి విలువలు పెంచటం, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చిర్రి బాలరాజుని నిర్వాసితులు వేడుకోవడం జరిగింది. బాధలన్ని విన్న తరువాత ఈ సమస్య పై త్వరలోనే ప్రణాళిక ప్రకటించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా జనసేనా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపించుకుంటే ఈ కష్టాన్ని తీరుస్తామని గ్రామస్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆది నారాయణ, అధికార ప్రతినిధులు మెచినేని సంజయ్, కొవ్వాలా క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.