ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు నియోజకవర్గం, సుమారు రెండు నెలల క్రితం ఏ.ఎస్.పేట మండలం, పెద్ద అబ్బీపురం గ్రామంలో నాలుగు సంవత్సరాల వయసుగల 96 మామిడి చెట్లను నరికి వేయడం జరిగింది. అంతేకాక రెండు వ్యవసాయ బోర్లను ధ్వంసం చేయడం జరిగింది. ఈ అమానుష చర్యను ఖండిస్తూ ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బి.ఎస్.ఆర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాస్తారోకో సమయంలో స్థానిక పోలీసు అధికారులు వచ్చి, వారం రోజుల లోపల నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని తిరుపతిలో జరిగిన జనసేన పార్టీకి సంబంధించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియజేయడం జరిగింది. అధ్యక్షుల వారు వెంటనే తీవ్రంగా స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర డి.జి.పికి రాతపూర్వకంగా తెలియజేసి బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరడం జరిగింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు పోలీస్ అధికారులు ఎవరిని అరెస్టు చేయడం జరగలేదు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో బాధితులతో మరియు జనసైనికులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు సోమవారం నుండి కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ నిందితులను అరెస్టు చేసే వరకు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, తిరుమల, పవన్, నాగరాజు, భాను వేణు, అనిల్, హజరత్ మరియు బాధిత రైతులు ఇమ్మిడిశెట్టి వెంకయ్య, ఊస వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.