ఆర్5 జోన్ ని వ్యతిరేకిస్తూ రైతుల రిలే నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం

మంగళగిరి నియోజకవర్గంలో ఆర్5 జోన్ ని వ్యతిరేకిస్తూ గత 6 రోజులుగా కృష్ణాయా పాలెంలో రాజధాని రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంను జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు సందర్శించి, రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా గాదె మాట్లాడుతూ.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని ప్రాంత వాసులు రోడ్డు న పడ్డారని, ఈ ప్రభుత్వం కోర్టు తీర్పు ను సైతం లెక్కచేయడం లేదని అన్నారు. హైకోర్టు మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతు లకు ఇవ్వాల్సిన ప్లాట్ లు ఇవ్వమని చెపితే పాటించని జగన్ రెడ్డి కృష్ణ నది అవతల ఉన్న వారికి, గుంటూరు వారికి ఇక్కడ ప్లాట్ లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బటన్ రెడ్డి దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నారని, నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కనీసం 3సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి బేతంపూడి విజయ్ షేకర్, జిల్లా నాయకులు నరదాసు ప్రసాద్, నెల్లూరి రాజేష్, అంకమ్మరావు, యడ్ల వెంకటేశ్వరరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, తాడేపల్లి ఉపాధ్యక్షులు తంబీ, సురేష్, రాజీవ్ నాయుడు, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కాపరౌతు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.