వన్నెపూడి గ్రామంలో పవన్, ఉదయ్ లకు మద్దతుగా ప్రచారం

  • పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్, ఉదయ్ శ్రీనివాస్ లను అత్యధిక మోజర్టీతో గెలిపించుకొవాలి: జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామం నందు మహలక్ష్మి అమ్మవారి గుడి నుండి జనసేన,
తెలుగుదేశం, బిజెపినాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడికూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొణిదల పవన్ కళ్యాణ్ కు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మిడికూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి మద్దతుగా వన్నెపూడి గ్రామంలో మహలక్ష్మి అమ్మవారి గుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ముందుగా మహలక్ష్మి అమ్మవారి గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి, అమ్మవారిని దర్శించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు, కాకినాడ పార్లమెంటరీ కమిటి జనసేన కమిటీ సభ్యులు బవిరిశెట్టి రాంబాబు, మొయ్యళ్ళ నాగబాబు, బవిరిశెట్టి గోపాలకృష్ణ, గొల్లపల్లి కృష్ణార్జున, పచ్చిదల దత్త, దొడ్డిపట్ల గణేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మొయ్యళ్ళ రాంబాబు, మొయ్యళ్ళ సత్యనారాయణ అధ్యక్షతన ప్రచారం ప్రారంభించారు. అనంతరం వన్నెపూడి గ్రామంలో ఇంటిఇంటికి వెళ్ళి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు వన్నెపూడి గ్రామంలో గల ఓటర్లు గాజుగ్లాసు పై ఓటు వేసి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని, కాకినాడ పార్లమెంటు సభ్యునిగా ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించుకొంటే పిఠాపురం నియోజవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకొవచ్చో మేనిపెస్టో పాంఫ్లీట్ ను ఓటర్ల కు అందజేసి తెలియజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ జరగబోయే పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికలలో ఎన్.డి.ఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ అభ్యర్థులను నెగ్గించుకుని డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రాంలో, కేంద్రంలో మద్దతు ఇవ్వాలని కేంద్రంలో బిజెపి {ఎన్.డి.ఏ}కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాలు ఏర్పడితే సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడతాయని తద్వారా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ప్రయాణించబడుతుందని తెలియజేశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో వన్నెపూడి గ్రామ ఓటర్లులను తమకు గల 2 ఓట్లును గాజుగ్లాసు గుర్తులు పై వేసి పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యునిగా కొణిదల పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వ్యక్తిగతంగా ప్రతి ఓటరుని కలిసి ప్రచారం నిర్వహించారు.‌ ఈ కార్యక్రమంలో దొడ్డిపట్ల బాబులు, దొడ్డిపట్ల బాబ్జి, మొయ్యళ్ళ వీరరాఘవ, గుడాల వీరస్వామి, మొయ్యళ్ళ శ్రీనివాసరావు, పచ్చిపాల దత్త, కంద శివ, పచ్చిపాల శివ, గొల్లపల్లి రాజారావు, యర్రా సతీష్, గొల్లపల్లి అప్పలరాజు, కంద శ్రీధర్ గొల్లపల్లికొండయ్య, రాసంశెట్టి కృష్ణ, ఓపెన్ రమేషుని దుర్గాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు కొప్పున రమేష్, గొల్లపల్లి గంగా ఈశ్వరుడు, కీర్తిచిన్న, కోలా నాని జీలకర్ర భాను, నేమాల కన్నయ్య, నాగబోయిన వీరబాబు, చేబ్రోలు జనసేన నాయకులు సఖినాల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు.