కొల్లిమర్ల రోడ్ల దుస్థితిపై గళమెత్తిన గాదె

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సోమవారం ప్రత్తిపాడు నియాయోజకవర్గం, కాకామను మండలం, కొల్లిమర్ల గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో ఉన్న పిల్లలు ప్రతి రోజు స్కూలుకి వెళ్లే రోడ్ గుంతల మయంగా మారి పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే ఆ రోడ్ పడితే కొల్లిమర్ల గ్రామం నుండి గుంటూరు కి రావడానికి దగ్గరగా ఉంటుంది. ఆ రోడ్ లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరంగా ఉండాల్సి వస్తుంది అని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్య అనేక సార్లు స్థానికులు అధికార పార్టీ నాయకులు మరియు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. కానీ ఎవరు స్పందించలేదు.. ఈ సమస్య జనసేన పార్టీ దృష్టికి రావడంతో ఈ రోజు ఆ రోడ్డుకి మరమ్మత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరితగాతిన స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురు కోవాల్సిఉంటుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, కాకుమాను మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, వట్టిచెరుకూరు మండల అధ్యక్షులు పత్తి భావన్నారాయణ, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *