సీతానగరం మండలంలో వైసీపీకి భారీ షాక్- జనసేన పార్టీలో భారీ చేరికలు

  • 500 మంది (నేతలు, కార్యకర్తలు) వైసిపి వీడి “బత్తుల” సమక్షంలో జనసేన పార్టీలో చేరిక..
  • జనసేన టిడిపి పొత్తులో భాగంగా రాజానగరం నియోజకవర్గ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించన రోజు నుండి మరింత ఉదృతంగా ప్రతిరోజు జోరుగా చేరికలు
  • ఈసారి రాజానగరం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరుల నమ్మకం, ఆశీస్సులు బత్తులకే
  • స్వచ్ఛందంగా తరలివచ్చి బత్తుల సమక్షంలో చేరిన వారిలో వివిధ కులాలు, మతాలు, వర్గాలకు చెందిన మహిళలు
  • వైసిపి కూసాలు కదిలించిన బత్తుల
  • కుదేలై పట్టు కోల్పోయి, నిరాశలో కూరుకుపోతున్న వైసిపి
  • ప్రజాదరణ, వరస చేరికలు, వివిధ కులాల పెద్దల మద్దతు, ఆశీస్సులతో ప్రజా నాయకుడిగా దూసుకుపోతున్న బత్తుల బలరామకృష్ణ
  • జనసేన ఆత్మీయ సమావేశానికి భారీగా తరలివచ్చిన జనసేన టిడిపి శ్రేణులు.. కార్యక్రమం అత్యంత విజయవంతం

జనసేన టిడిపి పార్టీల మధ్య సమన్వయం, ఇరు పార్టీల ఐకమత్యం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సీనియర్ నేతల సలహాలు, సూచనలు, ఇరు పార్టీల గౌరవం, క్రమశిక్షణ, ప్రజల్లోకి జనసేన టిడిపి కూటమి విధానాలను మేనిఫెస్టోను వివరిస్తూ, వైఎస్ఆర్సిపి అవినీతి అరాచకాలను ప్రజల్లో ఎండకడుతూ.. రానున్న ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ యే లక్ష్యంగా రాబోవు ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహం.. తదితర అంశాలపై శ్రేణులకు దశాదిశా నిర్దేశం చేసిన “బత్తుల”

రాజానగరం నియోజవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామం… జీవీకే కళ్యాణ మండపంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశం అత్యంత ఆనందకరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తుల బలరామకృష్ణ చేసిన ప్రసంగంలో.. జనసేన టిడిపి శ్రేణులు సమన్వయంతో, ఐకమత్యంగా ఎలా ముందుకు వెళ్లాలి.. శ్రీ చంద్రబాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ముందుకు వెళుతున్న తీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు గారు మనపై ఉంచిన నమ్మకం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తనపై అనవసరంగా అసత్యపు ఆరోపణలతో నీచమైన ఆరోపణలు చేస్తున్న వైసిపికి దీటుగా సమాధానం చెప్పడం టిడిపి సీనియర్ నేతల సలహాలు, సూచనలతో వారి అనుభవాన్ని, గౌరవిస్తూ జనశ్రేణులు సమన్వయంతొ రాజానగరం నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు గారు నమ్మకాన్ని నిలబెట్టడం వంటి విషయాలపై క్లుప్తంగా మాట్లాడారు. అనంతరం మండలంలోని వివిధ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన 500 మంది నేతలు, కార్యకర్తలు (మహిళలు అత్యధికం) వైసిపి అసమర్థపు, అవినీతి పాలనకు విసుగుగి చెంది, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గార్ల దంపతుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.