న్యాయానికి దారేది? ఎన్నాళ్ళు ఈ అక్రమ కేసులు

గంగాధర నెల్లూరు, కార్వేటినగరం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలనుకోవడాన్ని కార్వేటినగరం మండల కమిటీ సమావేలంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు మా అన్న యుగంధర్ కి నియోజకవర్గంలో ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ చూసి, మా నాయకుడికి ప్రజలు నీరాజనాలు పడుతున్న విధానాన్ని చూసి ఓర్వలేక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అక్రమ కేసులు పెట్టి జనసేన ఇంచార్జ్ ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. కొన్ని సెక్షన్ల మీద 41ఏ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకొన్ని సెక్షన్లు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని 2024 లో ఓడించడం ఖాయం. నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయం. మా అన్న యుగంధర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం. మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించిన మాకు న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయస్థానంలోనే తెల్చుకుంటాం అప్రజాస్వామికమైన చర్యలను మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.