క్రియాశీలక కార్యకర్త మధు సూదన్ కు ప్రమాద భీమా చెక్ అందజేత

ఆముదాలవలస నియోజకవర్గంలో మదనాపురం గ్రామానికి చెందిన మధు సూదన్ ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా నాయకులు, మధు సూదన్ జనసేన క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నందున ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం, స్థానిక నాయకులను నుండి సమాచారం సేకరించి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, గాయపడిన కార్యకర్త యొక్క కుటుంబానికి 50వేల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులకు పంపించి మధు సూదన్ కుటుంబసభ్యులకు అందజేయవలసినదిగా సూచించారు.. ఈ మేరకు ఆదివారం జనసేన పీఏసీ సభ్యులు శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో మరియు గ్రామ జనసేన నాయకుడు అనంత్ సమక్షంలో గాయపడిన మధు సూదన్ కుటుంబానికి 50000 రూపాయలు చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పేడడ రామ్మోహన్, పాత్రుని పాపారావు, అంపిలి విక్రమ్ (ఎంపీటీసీ), కొల్ల జయరాం మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.