రైతు కంట కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు: బొబ్బేపల్లి సురేష్

  • కౌలు రైతులకు న్యాయం చేయాలి, అలా జరగనీ పక్షంలో వాళ్లకి జనసేన అండగా ఉండి వాళ్లకి న్యాయం జరిగే వరకూ పోరాడుతుంది

సర్వేపల్లి: జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, వీరంపల్లి గ్రామం నందు పర్యటించారు. అక్కడ ప్రజల ఇబ్బందులు మరియు ధాన్యాన్ని అమ్మిన కవులు రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బొబ్బేపల్లి సురేష్ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో కవులు రైతులు ఆరుగాలం పండించిన పంటని వైసిపి ఉపసర్పంచ్ గుమ్మ అశోక్ దళారీగా ఉంటూ రైతులు దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఎనిమిది నెలలు కావస్తుంటే, ఇప్పటివరకు వారికి డబ్బు చెల్లించకపోగా.. సరైన సమాధానం కూడా చెప్పనటువంటి పరిస్థితి. కౌలు రైతులు యజమానులకు కవులు కట్టాలి .. పంట కోసం తెచ్చుకున్న ఎరువులకి, కోత మిషన్ కి ఇలా వ్యవసాయానికి సంబంధించి తెచ్చుకున్న అప్పులన్నిటినీ కట్టవలసి ఉండగా.. అమ్మిన ధాన్యానికి సంబంధించిన డబ్బు రాకపోవడంతో తల్లడిల్లిపోతూ మాకు న్యాయం జరిగే దానికి మార్గం లేదా అని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ నుంచి మేము వెళ్లి వారిని కలవడం, వారితో మాట్లాడటం జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకొని కౌలు రైతులకు న్యాయం చేయాలి, అలా జరగనీ పక్షంలో వాళ్లకి జనసేన పార్టీ అండగా ఉండి వాళ్లకి న్యాయం జరిగే వరకూ పోరాడుతుంది. అదేవిధంగా రైతులను మోసం చేసిన దళారి గుమ్మా అశోక్ ను పోలీస్ యంత్రాంగం అదుపులోకి తీసుకొని తక్షణమే అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నుంచి సురేష్ డిమాండ్ చేశారు.