పేరు గొప్ప.. ఊరు దిబ్బ..

  • వైయస్సార్ నగర్ సమస్యలపై జనసేన ఫిర్యాదు

నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో 30వ డివిజన్లో ఉన్న వైయస్సార్ నగర్ పరిస్థితి ఇది అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మేయర్, కమిషనర్ లకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్సార్ పేరు పెట్టారు కాబట్టి ఈ నగరు సర్వాంగ సుందరంగా సకల మౌలిక వసతులతో ఉంటుందనుకుంటే పొరపాటే..స్థానికులకు తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా అందించ లేకుంది వైసిపి ప్రభుత్వం. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి స్థానికంగా అధికారంలో ఉన్నా, నిన్న కార్పొరేషన్ కూడా డివిజన్ కూడక వైఎస్ఆర్సిపి పార్టీనే గెలిచినా ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించకుండా ఇబ్బంది పెడుతోంది. ఈ ప్రాంతం ఏర్పాటు చేసి 13 సంవత్సరాలు గడిచింది కి పైప్ లైన్ ఏర్పాటు చేసినా నీరు అందించలేకున్నారు. రోడ్ల నిర్మాణం 90% అసంపూర్ణంగానే ఉంది ఇక సైడ్ కాల్వల నిర్మాణం లేక ఇంటి ముందే గుంటలలో వ్యర్దాలు. చెత్తా, చెదారం, పాములు,దోమలు, పందులు బెడద సరాసరి వీటన్నిటిని గురించి గత సంవత్సరం కిందట కమిషనర్ గారికి ఫిర్యాదు చేశామని. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారుల్ని కలవడం జరిగింది. పైపులైను ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ కంపెనీకి నగదు చెల్లించకపోవడంతో నీటి సరఫరా ఆగిందని, అదేవిధంగా సైడ్ కాల్వలు, రోడ్లు అనేవి ఖర్చుతో కూడుకున్న పరిస్థితి కాబట్టి కార్పొరేషన్ లో చర్చకు పెడతామని. సంబంధిత అధికారులను ప్రాంతానికి పంపిస్తామని తెలిపారు.సమస్యపై మేయర్ శ్రీమతి స్రవంతి గారిని కూడా కలిసి ఒకసారి ప్రాంతాన్ని విసిట్ చేసి పేదల మౌలిక వసతులు కల్పించాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా కాలువలు కట్టించడానికి ఆర్థికంగా కార్పొరేషన్ కి స్తోమత లేకపోతే స్థానికులే కాలవలు కట్టించుకునే సిద్ధంగా ఉన్నారని ప్రోక్లైన్తో కాలవమార్గాన్ని ఏర్పరచవలసిందిగా కోరారు. జనసేన పార్టీ తరఫున తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేస్తున్నామని ప్రస్తుతం వైఎస్ఆర్సిపి రూరల్ ఇన్చార్జిగా ఆదాబల ప్రభాకర్ రెడ్డి సత్వరమే స్పందించి తగువసతులు కల్పించాలి. లేని పక్షం లో స్థానికులతో కలిసి జనసేన పార్టీ తరఫున ఒకరోజు దీక్షకు కూర్చుంటామని అదే విధంగా నిరసన ఉదృతం చేసి సమస్యలు పరిష్కరించే వరకు పేదలకు అండగా ఉంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రూరల్ క్రియాశీలక నాయకులు ఖలీల్, హేమచంద్ర యాదవ్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు.