పలు శుభకార్యాలకు హాజరైన పితాని

ముమ్మిడివరం: శుక్రవారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం కర్రి వాని రేవు గ్రామంలో శ్రీ విజయ దుర్గా అమ్మవారు పునః నూతన ఆలయం విగ్రహ ప్రతిష్ట ఉత్సవము లో పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం ఠాణే లంక గ్రామంలో మేడిద కృష్ణ సత్య శివగంగ ప్రసాద్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పల్లవారు పాలెం జక్కంపూడి చిన్న బాబు కుమారుడు సతీష్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ముమ్మడివరం టౌన్ 17వ వార్డు కలలి వారి నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. శెట్టి పేట గ్రామంలో శీలం లక్ష్మీ అర్చన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అమలాపురం ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో ఐదవ బత్తుల ఈశ్వరరావు కుమారుడు నరేష్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కడియం గిరిజాల వీర్రాజు కుమార్తి కుసుమ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అమలాపురం బి ఆర్ కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏడిద వెంకటేశ్వరరావు కుమార్తె శేషు వేణి సమంత వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.