పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, గేదెలంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కడలి పెద్ద వీరన్న శెట్టి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మరణించిన కడలి విజయ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ, పితాని రాజు, బొంతు వీరబాబు మరియు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.