ఏపీ రాజధానిపై సుప్రీం కోర్టులో కీలక పరిణామం… కేసును మ‌రో బెంచ్‌కు బ‌దిలీ చేస్తూ వాయిదా

ఏపీలో మూడు రాజ‌ధానుల వ్యవ‌హారంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సుప్రీకం కోర్టులో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మసనం వేరే బెంచ్ ముందు లిస్ట్ చేయాలని సూచించింది.

ఎందుచేతనoటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణీ బాబ్డే.. హైకోర్టులో పిటిషనర్ రైతుల తరుఫున వాదనలు వినిపించారు.. దీంతో వేరే బెంచ్‌కు బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నిర్ణయం తీసుకుంది.. ఈ కేసును సుప్రీం కోర్టులోని వేరే ధర్మాసనం ముందు బుధవారం విచారణ జ‌ర‌గ‌నుంది.

మరోక వైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా, గత వారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.