ప్రజల కష్టాలో నుంచి పుట్టిన నాయకుడు మా దాసరి రాజు!

ఇచ్ఛాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు, టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు చేసిన వ్యాఖ్యలపై ఇచ్ఛాపురంలో వైసీపీ ఎంపీపీ మరియు ఏఎంసి చైర్ పర్సన్ లు పత్రికా సమావేశంలో దాసరి రాజుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి హరి బెహరా మరియు జనసేన నాయకులు ఇచ్చాపురంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిన నాయకుడు మా దాసరి రాజు, ప్రజలని ప్రలోభ పెట్టి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయిన కృత్రిమ నాయకుడు మీ అప్పలరాజు…! మా నాయకుడు దాసరి రాజు స్థాయిని గురించి మీరు మాట్లాడే ముందు మంత్రి సీదిరి అప్పలరాజు స్థాయి గురించి తెలుసుకోండి. పేద కుటుంబం నుండి వచ్చాను అని ప్రజల సింపతితో పేద ప్రజల ధన, ఆస్తులను కబ్జాలు చేస్తూ, అప్పలరాజు గెలుపు కోసం అహర్నిశలు పని చేసిన వైసీపీ నాయకులను పక్కన పెట్టి భూ బకాసురులని పక్కన పెట్టుకొని 600 కోట్లు సంపాదించాడు అని పత్రికలు టీవీ ఛానల్ లు కోడై కూస్తున్న మాట వాస్తవం కాదా..? అని జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ప్రశ్నించారు? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై మీ మంత్రి మరియు ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పినప్పుడు దాసరి రాజు కూడా మాట్లాడిన మాటల్లో ఏమైనా మాటలు తప్పుగా అనిపిస్తే అప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకుంటారు. దాసరి రాజు స్థాయి గురించి మాట్లాడారు కదా స్థాయికి మించిన మాటలు అంటే మీ దృష్టిలో ఏంటి ప్రజా సమస్యలపై పోరాటం చేయడమా? నీతి నిజాయితీలతో ఉండడమా? దీనికి మాజీ ఎంపీపీ కారంగి మోహన్ రావు, వైసిపి నాయకులు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అలాగే హరి బెహరా మాట్లాడుతూ ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఒక పార్టీ అధ్యక్షలుపై దువ్వాడ శ్రీను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్థాయిలు గుర్తుకు రాలేదా? టెక్కలిలో కూతురు పెళ్లి కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడను విరిచి తిరిగి ఇప్పటివరకు కూడాను గోడ నిర్మాణం చేయలేదు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ నాయకులు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం అని, దువ్వాడ శ్రీను గతంలో ప్రజా రాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్యాకేజి తీసుకున్నారని వార్తలొచ్చాయి అని ఇలాంటి వారిని వెనకేసుకుని రావడం ఏంటని ప్రశ్నించారు? ఇచ్చాపురంలో దాసరి రాజు చాలా సమస్యలపై పోరాటం చేస్తున్నారని అలాంటి వ్యక్తి స్థాయిని కోసం మాట్లాడటం వైసీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి అభ్యర్థి తిప్పన నిలవేణి రెడ్డి, హరిపురం సర్పంచ్ అభ్యర్థి దుర్గాసి నేలవేణి రెడ్డి, రోకళ్ళ భాస్కర్, సంతోష్ మహారాణా, దుంగు భాస్కర్ రెడ్డి, వల్లభ, కుమార్ రెడ్డి, దుర్యోధన, జోగారావు రెడ్డి, కాళీ, చిట్టు బెహరా, మోహన్ రావు, మోహన్ రెడ్డి, రాజు బెహరా, తదితరులు పాల్గొన్నారు.