ఆంధ్రప్రదేశ్ రోడ్ల అద్వాన పరిస్థితికి సజీవ సాక్ష్యం: ఎస్ వి బాబు

పెడన, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు నరకానికి నకళ్ళని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండ కడుతూనే ఉన్నారు. జూలై 15, 16, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రోడ్ల అద్వాన పరిస్థితి పై #GoodMorningCMSir ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. గత ఏడాది కూడా రహదారుల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ నిర్వహించింది. కానీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై మాటల దాడి చేశారే తప్ప వాస్తవాన్ని గ్రహించలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలోని కొత్త బస్వాపురం గ్రామానికి రహదారి లేదు అంటూ వార్డు మెంబర్ బురద రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. 300 మీటర్లు పొర్లు దండాలు పెడుతూ జగనన్నా… మాకు రోడ్డు వేయండి అంటూ నినాదాలు చేశాడు ఆ యువకుడు. అడుగుకు ఒక గుంట, గజానికో గొయ్య అన్నట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు. పెడన నియోజకవర్గంలో ఏ గ్రామానికి సరైన రహదారి లేదు. రోడ్ల పరిస్థితి మారాలంటే కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మారవాల్సిందే. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి లేదు, అరాచకం తప్ప. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను బండ బూతులతో వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప, పనిచేయడం చేతకాదు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఓటు హక్కు అనే ఆయుధంతో వైసిపి పార్టీకి సరైన బుద్ధి చెబుతార పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.