తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం

హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామ స్థాయిలో కమిటీలను వేయబోతున్నట్లు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు మల్లెల సంతోష్, కొలుగూరి అనిల్, శ్రావణపల్లి శ్రీకాంత్, వేల్పుల మధు, ఆకుబత్తిని రాకేష్ తదితరులు పాల్గొన్నారు.