ఉప్పినవలస గ్రామంలో జనసైనికుల సమావేశం

ఆమదాలవలస నియోజవర్గంలో, ఉప్పినవలస గ్రామంలో జనసైనికులతో, క్రియాశీలక సభ్యత్వం గురించి మరియు జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, లాంటి చాలా విషయాల మీద, సుమారు గంట పాటు చర్చించడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొని, చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మన ఉప్పినవలస జనసేన పార్టీ టీం జనసైనికులు అందరికీ కూడా పేరుపేరునా, హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మల్లేశ్వరరావు కోరుకొండ, ఎంపీటీసీ విక్రమ్, కొల్ల జయరాం మరియు జనసైనికులు పాల్గొన్నారు.