తుఫాను వల్ల నష్టపోయిన మిర్చి రైతాంగాన్ని ఆదుకోండి

  • జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు

గంపలగూడెం: మండలంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన జనసేన నాయకులు.. గురువారం మండలంలోని ఆర్లపాడు, గాదివారిగూడెం, మేడూరు తదితర పరిసర ప్రాంత గ్రామాలలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, మరియు మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకట కృష్ణారావు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ మండలంలో సుమారు 5000 ఎకరాలు మిర్చి సాగు ద్వారా జీవనం సాగిస్తున్న చిన్న సన్నకారు రైతులను మిచౌంగ్ తుఫాన్ నట్టేట ముంచిందని, ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితితుల వలన ఎకరం మిర్చి సాగుకు కనీసం లక్షన్నర రూపాయల ఖర్చైందని, గోరుచుట్ట పై రోకలి పోటులా మిచౌంగ్ తుఫాన్ విరుచుకు పడిందని వారన్నారు. మిర్చిపంట పెట్టుబడికి లక్షన్నరకి తోడు, తుఫాన్ వల్ల ఎకరానికి పది క్వింటాళ్ల మిర్చి పైరు దిగుబడి తగ్గటమే గాక నాణ్యత కూడా లోపిస్తుందని గాలికి పడిపోయినటువంటి మిరప మొక్కలను కూలీలతో సరిచేయడానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు స్వయంగా తెలియజేస్తున్నారని అన్నారు.. అలానే మిర్చి పంటతో పాటు నీట మునిగిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని మండలంలో చాలా గ్రామాల్లో వరి పంట మునిగిపోవడం వల్ల ధాన్యం మొలకెత్తిందని సాధ్యమైనంత వరకు నీట మునిగిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఎకరం వరి పొలానికి 20 వేల రూపాయలు తక్షణ సాయం కింద అలానే మిర్చి రైతులకు తక్షణ సాయం కింద ఎకరానికి 50వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వారన్నారు. అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కి, వ్యవసాయ శాఖ అధికారులకు మాండ్లతో కూడిన వినతి పత్రం జనసేన పార్టీ తరఫున అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యవర్గ సభ్యులు వట్టి కొండ కృష్ణ, పసుపులేటి మాధవరావు, దండేల తిరుపతిరావు, ఓరుగంటి సురేష్, పసుపులేటి మల్లికార్జునరావు, కొంకి రవి, పసుపులేటి సాంబశివరావు, మిరియాల అంజన్న బాబు, కొంకి బాలకృష్ణ, పసుపులేటి రామకృష్ణ, కృష్ణ ఆంజనేయులు, రామయ్య, గాదె గోపి, పసుపులేటి శివకృష్ణ, మిరియాల శ్రీను తదితరు జనసైనికులు, మరియు రాఘవరపు రమేష్, కొంకీ హరికృష్ణ, పసుపులేటి సుబ్బారావు, దితర రైతులు పాల్గొన్నారు.