జనసేన పార్టీ బలోపేతానికి జిల్లా కమిటీ మహిళా సభ్యుల సమావేశం

గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికై మహిళల్ని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ అభివృద్ధికి దోహదం చేసేలా జిల్లా కమిటీలోని మహిళా సభ్యులు నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేసి మహిళలను కలిసి పార్టీ సిద్ధాంతాలు తెలియపరుస్తూ మహిళల్ని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా మంగళగిరి, వేమూరు, పొన్నూరు మరియు బాపట్ల నియోజకవర్గాల లో పర్యటించి మహిళలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బిట్రగుంట మల్లిక, బడే కోమలి, బంధనాల జ్యోతి, రావి రమా, తులసి కుమారి, సోమరౌతు అనురాధ, నగర కమిటీ సభ్యులు కటకంశెట్టి విజయ లక్ష్మి, మల్లీశ్వరి, గడదాసు అరుణ, శివ మాణిక్యాం, కవిత మరియు నియోజకవర్గాల వీర మహిళలు పాల్గొన్నారు.