గంగమ్మ తల్లికి మెక్క తీర్చుకున్న సానిపాయి టిడిపి శ్రేణులు

రాజంపేట: చంద్రబాబుకు మధ్యస్థబెయిల్ రావడంతో వీరబల్లి మండలం, సానిపాయ గ్రామంలో మాజీ సర్పంచ్ నేతి వెంకటరమణ ఆధ్వర్యంలో టిడిపి మరియి జనసేన కార్యకర్తలతో కలిసి సానిపాయ గ్రామ నడిబొడ్డున ఉన్న గ్రామ దేవత గంగమ్మ తల్లికి పూల మాల వేసి, 101 టెంకాయిలు కొట్టి మెక్కు తీర్చుకొన్నారు. అదే విధంగా చంద్రబాబు మంచి ఆరోగ్యకరముగా తొందరగా ప్రజల మద్యకు రావాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించాలని కోరున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి సునకానందం పొందడం తప్ప 50 రోజులు పాటు అక్రమంగా రిమాండ్ లో ఉంచుకొని ఒక్క ఆధారం కూడా నిరూపించలేక పోయారు అని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పరిపాలన మీద శ్రద్ద వహించకుండా ఎలక్షన్ సమీపించడంతో ప్రతిపక్ష నాయకులను సామాన్య ప్రజల ను బయబ్రాంతులు గురి చేయడంపై శ్రద్ద వహిస్తున్నారని అన్నారు. ఇదే తంతు పరిపాలన సాగిస్తే టిడిపి మరియి జనసేన ఉమ్మడి కార్యాచరణతో రాబోయే ఎలక్షన్ లో వైసిపి కి డిపాజిట్ కూడా రాకుండా చేస్తారని హెచ్చరించారు. టిడిపి, జనసేన ఉమ్మడి ప్రబుత్వాన్ని 2024 ఎలక్షన్ లో ఏర్పాటుచేయడం ఖాయం అని ఆశాభంగం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత కార్యదర్శి నేతి రమేష్ బాబు, మాజీ వార్డు మెంబర్ గుదే రఝనాయుడు, జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున జనసేన వార్డు మెంబర్ గుగ్గిల్ల వెంకటేస్, వై మనోజ్, గుగ్గిల్ల చిన్న రెడ్డెయయ్య, గాలి శివయ్య, అనిపినేని నాగేశ్వర నాయిడు, నేతి నాగార్జున, చింతకుంట వెంకటేష్, చింతకుంట జీవన్ కుమార్, గురిగింజ కుంట బాస్కర్ నాయిడు, ఉన్నం గోపాల్ నాయిడు, ఆదిమూలం పుల్లయ్య, శిరియాల గంగయ్య, కొమ్మునాగయ్య తదితరులు పాల్గొన్నారు.