మలికిపురం జనసేన అధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా నియోజక ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్య వాణి రాము. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాణం ఏర్పడిన రోజని, దేశ ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో గొప్పగా విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని నిర్మించినఒదులకు, ప్రతి ఒక్కరూ మన దేశంలో పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులతో జీవించుచున్నారని, మన భారత రాజ్యాంగం, ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంత పటిష్టమైందని, శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఇవే మా జోహార్లు అని అన్నారు… ఈ కార్యక్రమంలో రామరాజులంక ప్రెసిడెంట్ కాకర్ల శ్రీను, వైస్ ప్రెసిడెంట్ గంగరాజు, ఎండిఒ బాబ్జీ రాజు, సూపర్వైజర్ రాజారత్నం, ఎఎన్ఎం స్టాఫ్, సచివాలయం స్టాఫ్ పాల్గొన్నారు.