జనసేన కావలి టౌన్ మున్సిపల్ వార్డ్ ప్రెసిడెంట్ల ఆత్మీయ సమావేశం

కావలి నియోజకవర్గం: జనసేన పార్టీ కావలి టౌన్ మున్సిపల్ వార్డ్ ప్రెసిడెంట్ లతో కావలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజవర్గ ఇంచార్జీ అళహరి సుధాకర్ ఆధ్వర్యములో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో టౌన్ అధ్యక్షుడు పోబ్బా సాయి, అధికార ప్రతినిధి రుషికేశ్, కో ఆర్డినేటర్ సుధీర్ వార్డ్ అధ్యక్షులకు దిశానిర్దేశం చెయ్యడము జరిగింది. వార్డ్ అధ్యక్షులు కూడా మాట్లాడుతూ వారి వారి వార్డులలో ఎలా పనిచేస్తుంది వివరించారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్స్ లో కావలి మునిసిపల్ వార్డ్ అధ్యక్షుల పాత్ర ఎంతో కీలకమైనది అని, టీడీపి వార్డ్ ఇంచార్జీలు జనసేన వార్డ్ ప్రెసిడెంట్ లతో కలిసి వెళ్ళే విధంగా కార్యాచరణ టీడీపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డి గారితో కలిసి కార్యాచరణ రూపొందించి మీకు తెలియ పరుస్తాము అని. జనసేన పార్టీ టీడీపీ పక్కన నడుస్తుంది కానీ వెనక నడవదని మీకు అవమానము జరిగితే, నాకు జరిగినట్లు, నాకు జరిగితే పవన్ కళ్యాణ్ గారికి అవమానము జరిగినట్లు, కాబట్టి ప్రతీ ఒక్కరూ హుందాగా వ్యవహరించి ప్రతీ ఒక్కరూ జనసేన పార్టీ కోసమే పనిచేస్తున్నామని పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరారు. అలానే మీ మీ పోలింగ్ బూతులతో బూతు ఇంచార్జీ లకు మీరు దిశానిర్దేశం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమములో టౌన్ ఉపాధ్యక్షులు నాగార్జున, గాదెఒశెట్టి రవి, తోట శరణ్, ఆలా శ్రీనాథ, మస్తాన్, మురళి, కృష్ణయ్య, జానీ, నాని తదితర నాయకులు పాల్గొన్నారు.