జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం

  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత శనివారం మహిళలతో మాటామంతి 42వ రోజు కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 50వ డివిజన్ ఇందిరా నగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమై డివిజన్ సమస్యలను తెలుసుకొని జనసేన టీడీపీలకు ఓటు వేయాలని కోరారు. ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయని రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు ఘోరాల వల్ల విదేశీ పెట్టుబడులు రాష్టానికి రాకా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయి రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గుతుందని అందువల్ల అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలంటే రాక్షస వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పయాణించేలా చూద్దాం అని ఉమ్మడి మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను మహిళలకు వివరించారు. వీటితోపాటు స్థానిక డివిజన్ లో మురుగు కాలువల సమస్య మంచినీటి సమస్య దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.