క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశం

నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు సమీక్ష సమావేశం పూసపాటిరేగ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా పంచాయతీకి కనీసం ఒక సభ్యత్వ నమోదు వాలంటీరు ఉండేటట్లు నియోజకవర్గానికి వంద మందికి తగ్గకుండా జనసైనికులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు మూడవ విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ క్షేత్ర స్థాయికి మరింత చేరువయ్యేలా తీసుకెళ్లబోతున్నామని మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు సమావేశంలో వెళ్లడించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం పూసపాటిరేగ మండల అధ్యక్షులు పతివాడ అచ్చెన్నాయుడు, పతివాడ కృష్ణవేణి, వందనాల రమణ, జలపారి అప్పడుదొర(శివ), మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్,
బలభద్రుని జానకీరామ్, రొంగలి కృష్ణ, అనిల్, బొమ్మలాట గురుమూర్తి, పిసిని నాగరాజు, ఇల్లా అప్పారావు, దుక్క అప్పలరాజు, కె.వి.ఎస్ రామరాజు, అదపాక చరణ్, అల్లాడ జగదీష్, పొన్నాడ శ్యామ్, మహంతి గౌరీశంకర్, గొర్లె రమణ, పిసిని కుమార్, చందక దివాకర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.