ఆచార్య పీ.వీ.జీ.డి ప్రసాద్ రెడ్డిని తక్షణమే రీకాల్ చేయాలి: మాదాల శ్రీరాములు

విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పీ.వీ.జీ.డి ప్రసాద్ రెడ్డిని తక్షణమే రీకాల్ చేయాలని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన క్రింద తెలిపిన మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అవి..
ఆంధ్రా యూనివర్సిటీలో ఎత్తివేసిన 20 కోర్సులను తక్షణమే పునరుద్ధరించాలి.
ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగిన రీ-రీవాల్యుయేషన్ అవకతవకలపై విచారణ జరిపించాలి.
ఆంధ్ర యూనివర్సిటీ లో గతంలో 3వేలతో పూర్తి చేయగలిగిన పీజీ కోర్సు ప్రస్తుతం 20 నుండి 40 వేల రూపాయలకు పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలి.
కమీషన్ల కోసం ముద్రణాలయాన్ని మూసివేసిన రిజిస్టార్ ఉప కులపతి లపై విచారణ వేయాలి.
యూనివర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా నియమించిన రిజిస్టార్ నియామకాన్ని రద్దు చేసి విచారణ జరిపించాలి.
ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఓఎంఆర్ ప్రశ్నాపత్రాల కుంభకోణంపై విచారణ జరిపి బాధ్యులను అరెస్టు చేయాలి.
గత నాలుగు సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు ఇవ్వకుండా 75 మంది కుటుంబాలను వేధిస్తున్న ఉపకులపతి పై చర్యలు తీసుకోవాలి.
ప్రింటింగ్ స్టేషనరీ కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి.
యుజిసి రూసా నిధులు దుర్వినియోగం చేసిన వారిని అరెస్టు చేయాలి.
రూసా నిధుల కింద ప్రకటించవలసి న 400 డాక్టోరల్ మరియు 100 పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ లను తక్షణమే ప్రకటించాలి.
దళిత గిరిజన ప్రొఫెసర్లకు సీనియారిటీ ప్రకారం రావలసిన పదవులను ఇచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలి.
ఆంధ్ర యూనివర్సిటీ లో విద్యార్థులకు లైబ్రరీ మరియు రీడింగ్ రూము సదుపాయం కల్పించాలి.
నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా యూనివర్సిటీలో నియమించిన 40 మంది రిటైర్డ్ ప్రొఫెసర్ లను తక్షణమే తొలగించాలి.
ఆంధ్రా యూనివర్సిటీలో తొలగించిన 200 మంది గెస్ట్ ఫ్యాకల్టీ లను తక్షణమే విధుల్లోకి తీసుకుని వారికి న్యాయం చేయాలి.
ట్రాన్స్ డిసిప్లినరీ కోటాలో అడ్డగోలుగా ఇచ్చిన రీసెర్చ్ అడ్మిషన్లను రద్దు చేసి విచారణ జరిపించాలి.
సమాన పనికి సమాన వేతనం కింద సెక్యూరిటీ గార్డుల జీతాల లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి అందరినీ సమానంగా చూడాలి.

యూనివర్సిటీలో పర్మినెంట్ ఉద్యోగులను వేధిస్తూ.. అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరియు సెక్యూరిటీ అధికారి ఖాన్ ను తక్షణమే తొలగించాలని మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు.